Nani Gentleman Movie Theatrical Trailer | Nani | Surabhi | Nivetha Thoma... | FZ News


హైదరాబాద్‌: నాని ప్రధానపాత్రలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘జెంటిల్‌మన్‌’ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. నాని సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాని ఒకవైపు హీరోలా ... మరోవైపు విలన్‌లా కనిపిస్తున్నారు. ‘నిన్ను పెళ్లి చేసుకోవాలి... తెలివిగా చంపాలి’ అని నాని ట్రైలర్‌లో అంటున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. సురభి, నివేదా థామస్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలో ‘జెంటిల్‌మన్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top