కర్ణాటకలోనూ ఓ ఎడారి... కారణం వితంతువట! | FZ News


ఎడారి అనగానే రాజస్థాన్ గుర్తొస్తుందా? కానీ ఇది రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి కాదు. కర్నాటకలో ఉన్న మినీ ఎడారి. కావేరి నది ఒడ్డున ఉంది. కర్నాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఉన్న తాలకాడ్‌ గ్రామం పూర్తిగా ఇసుకతో నిండి ఎడారిని తలపిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో 30 దేవాలయాలు ఉండేవట. అందులో శివుడి పంచ ముఖాలకు ప్రతీకగా ఐదు శివలింగాలు కూడా ఉన్నాయట! కానీ అవన్నీ ఇసుకులో కూరుకుపోయాయి. 

స్థానికుల కథనం ప్రకారం శివ భక్తురాలైన ఓ వితంతువు ఈ భూమిని శపించిందట! అప్పటినుంచి ఈ గ్రామం మొత్తం ఎడారిగా మారిందని చెబుతారు స్థానికులు.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top