Most hugs in one minute - Guinness World Records | FZ News


ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకే ఒక్క నిమిషంలో ఎక్కువ మందిని కౌగిలించుకొని ప్రపంచ రికార్డు సృష్టించాడు ఓ హైదరాబాదీ. నగరానికి చెందిన కృష్ణకుమార్‌ అనే వ్యక్తి కేవలం ఒక్క నిమిషంలో 79 మందిని కౌగిలించుకున్నాడు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మందిని కౌగిలించుకున్న వ్యక్తిగా ఆయన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుకెక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ బుక్‌ అధికారికంగా యూట్యూబ్‌లో విడుదల చేసింది. చూడగానే నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకి చెందిన క్యారి బిక్‌మోర్‌ అనే వ్యక్తిపై ఉంది. ఈ రికార్డును కృష్ణ బద్దలు కొట్టాడు. అతను మొత్తం 83 మందిని కౌగిలించుకోగా అందులో కొందరిని సరిగా హత్తుకోలేదని, అలాంటి వారిని తీసేయగా 79 మందిని కౌగిలించుకున్నట్లు గిన్నిస్‌ బృందం ధ్రువీకరించింది. అలాగైనా రికార్డు బద్దలుకొట్టినందుకు కృష్ణ, ఆయనకు సహకరించిన 88 మంది విద్యార్థుల బృందం హర్షం వ్యక్తంచేశారు.



Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top