30 ఏళ్ల ప్రేమిది: నాగార్జున | FZ News




హైదరాబాద్‌: కింగ్‌ నాగార్జున సినీ జీవితం మొదలుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని నాగ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా గుర్తు చేసుకుంటూ... భార్య అమలతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. కుటుంబం, స్నేహితులు, అభిమానుల ఆదరణతో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, మరో 30 ఏళ్లు నటించడానికి సిద్ధంగా ఉన్నాననే అర్థం వచ్చేలా నాగ్‌ ట్వీట్‌ చేశారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావును, అమ్మను చాలా మిస్‌ అవుతున్నానని పేర్కొన్నారు.

'వూపిరి' చిత్రంతో మంచి విజయం అందుకున్న నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ భక్తిరస చిత్రంలో నటిస్తున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా'కు సీక్వెల్‌గా తెరకెక్కించనున్న 'బంగార్రాజు' చిత్రంలో కూడా ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.





Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top