Lucknow Tops List Of New Smart Cities | Warangal From TS | Union Minist | FZ News




న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మరో 13 స్మార్ట్ నగరాల జాబితాను మంగళవారం ప్రకటించారు. ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ సిటీ కాంపిటీషన్‌లో 23 నగరాలు పోటీ పడగా అర్హతలను పరిగణలోకి తీసుకుని 13 నగరాలను ఎంపిక చేశారు. వీటిలో లక్నో ప్రథమ స్థానంలో నిలించింది.

కొత్తగా ఎంపికైన స్మార్ట్ సిటీ నగరాలు:

లక్నో(యూపీ),భగల్‌పూర్ (బీహార్), కోల్‌కతా కొత్త నగరం (పశ్చిమ బెంగాల్), ఫరీదాబాద్ (హర్యానా), చంఢీగడ్ (హర్యానా), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), రాంచీ (జార్ఖండ్), ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్ ), వరంగల్ (తెలంగాణ), పానాజీ(గోవా), అగర్తలా (త్రిపురా), ఇంఫాల్ (మణిపూర్), పోర్ట్ బ్లేయర్ (అండమాన్ నికోబార్ దీవులు) కేంద్రం ప్రతిపాదించి వంద స్మార్ట్ నగరాల అభివృద్ధిలో భాగంగా 2015-16లో 20 నగరాలు, 2016-17లో 40 నగరాలు, 2017-18లో మరో 40 నగరాలను ఎంపిక చేస్తారు. 2019-20 నాటికి ప్రతి నగరాన్ని రూ.500 కోట్లతో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తారు.



Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top