మనకు కావాల్సిన నిజమైన ఎనర్జీ డ్రింక్‌ ఏంటో తెలుసా? | FZ News


అన్నీ ఇన్‌స్టెంట్‌గా మారిపోతున్న ఈ రోజుల్లో శక్తి కూడా ఇన్‌స్టెంట్‌గానే కావాలి. అందుకే ఎనర్జీ డ్రింక్‌ల పేరుతో ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి దించాయి. వాటి వల్ల ఉపయోగాల మాట ఎలా ఉన్నా దుష్పరిణామాలే ఎక్కువ. అయితే నిజమైన, చవకైన హెల్త్‌ డ్రింక్‌ను పక్కన పెట్టేసి ఇలా ఖరీదైన ఎనర్జీ డ్రింక్‌ల వెంట పరిగెత్తనవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఆ నిజమైన ఎనర్జీ డ్రింక్‌ ఏమిటని ఆలోచిస్తున్నారా.. మంచినీరు. అవును మంచినీళ్లను మించిని ఎనర్జీ డ్రింక్‌ ఏదీ లేదట. 

మంచినీటి గురించి కొన్ని విషయాలు:

1) దాహం వేయడానికి కారణం 

రక్తనాళాల్లో ఉండే గ్రాహకాలు (రెసెప్టర్స్‌) రెండు రకాలు. ఒకటి బారో రెసెప్టర్స్‌, రెండు ఆస్మో రెసెప్టర్స్‌. ఇవి నిరంతరం రక్తంలో ఉండే ద్రవ పరిమాణం, ద్రావిత గాఢత (నీటిలో కరిగే పదార్థం పరిమాణం)లను పర్యవేక్షిస్తుంటాయి. ఈ రెండింటిలో ఏది తగ్గినా వెంటనే మెదడుకు సంకేతాలు పంపిస్తాయి. ఆ వెంటనే మనకు దాహం వేస్తుంది. 

2)శరీరంలో నీటి శాతం ఎంత?

మానవ శరీరంలో ఉండేది అధికంగా నీరే. ఓ సగటు పురుషుడి శరీరం 60 శాతం నీటితో నిండి ఉంటే.. సగటు స్త్రీ శరీరం 55 శాతం నీటితో నిండి ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో అయితే నీటి శాతం మరింత ఎక్కువగా ఉంటుంది. 

3) నీరు ఎక్కువ తాగితే చనిపోతామా?

అవును.. అవసరమైన దాని కంటే అధిక మొత్తంలో నీరు తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం. దీనిని ‘ఓవర్‌ హైడ్రేషన్‌’ అంటారు. 75 కేజీల బరువున్న ఓ వ్యక్తి చాలా తక్కువ సమయంలో దాదాపు ఆరు లీటర్ల నీరు తీసుకుంటే అతను చనిపోయే ప్రమాదం ఉంది. ఎలక్ట్రోలైట్‌ అసమతుల్యత కారణంగా బ్రెయిన్‌ ఫంక్షన్స్‌ అన్నీ నిలిచిపోయి అతను చనిపోవచ్చు. 

4)యూకేలో వచ్చే కుళాయి నీళ్లు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛంగా ఉంటాయట.

5)ఇతర ఆహారం పదార్ధాల ద్వారా వచ్చే మినరల్స్‌ కంటే నీటి ద్వారా లభ్యమయ్యే మినరల్స్‌ను శరీరం సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుంది.

6) మనం తీసుకునే ఆహారం జీర్ణమవడంలో కీలకపాత్ర పోషించేది నీరే.

7)చెమట ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రతను సమన్వయపరుస్తుంది.

8)శరీరంలో ఉండే హానికర క్రిములను, విషతుల్యాలను బయటకు పంపించివేస్తుంది.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top