ఇంటర్నెట్ డెస్క్: ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన భామ ఇలియానా. తన అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించేసి అగ్ర కథానాయికగా మారిపోయింది. ఆ తర్వాత ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్‌లోనూ నటిగా పేరు తెచ్చుకుని పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన ‘రుస్తుం’ చిత్రంలో నటిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు తనకు వచ్చిన.. వస్తున్న ఆఫర్లలో చాలా వరకు అయిష్టంగానే నటిస్తున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘నా కోసం వచ్చే అవకాశాలు.. నాకిచ్చే అవకాశాలు ఏవీ నాకు నచ్చట్లేదు. అలా అని సినిమాలేవీ ఒప్పుకోకుండా వెండితెరకు దూరమవడం వివేకవంతమైన నిర్ణయం కాదు. అందుకే అయిష్టంగానైనా సినిమాల్లో నటిస్తున్నా. కమర్షియల్ సినిమాలో నటించడం.. అందాల ఆరబోతకి.. అదనపు ఆకర్షణగా ఉండే పాత్రలు చేయడంలో నాకు పెద్దగా ఇబ్బంది లేదు. సరదాగానే ఉంటుంది. కానీ.. అలాంటివి కొన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు ఆత్మసంతృప్తినిచ్చే సినిమాల్లో నటించాలని అనిపిస్తుంది.
Post a Comment