సీఎం కోసం కొత్త ఫార్చూనర్‌ కారు! | FZ News



ఆంధ్రజ్యోతి, బెంగళూరు: సీఎం సిద్దరామయ్య కోసం కొత్త ఫార్చూనర్‌ కారును కొనుగోలు చేశారు. శనివారం కాన్వాయ్‌లోని కొత్తకారులో సీఎం పర్యటించారు. గతంలో వినియోగించిన ఫార్చూనర్‌ కారు 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించడంతో కొత్తకారును కొన్నారు. రూ.28లక్షల ఫార్చూనర్‌ కొత్త డిజైన్ కారును కొనుగోలు చేశారు. శుక్రవారం కోరమంగల ఆర్టీఓ కా ర్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. సీఎం కొత్తకారు నెంబరు కేఏ01 ఈఏ 2016. సీఎం ఉపయోగించే కారుకు లక్కీ నెంబరు 9 వచ్చేలా నెంబరు కేటాయించారు. 

అధికారిక నివాసం కృష్ణ వద్ద ఈనెల 2న సీఎం ప్రయాణించే కారుపై కాకి కూర్చున్న విషయం తెలిసిందే. ఈ సమాచారాన్ని కొన్ని పత్రికల్లోనూ ప్రచురితమైంది. మూఢాచారాలను నమ్మేది లేదనే సీఎం సిద్దరామయ్య కేవలం వా రం రోజుల్లోనే కారు మార్చుకోవడం ప్రత్యేకం.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top