మందుకొట్టి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్! | FZ News




టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్ళిన మధురిమ అలియాస్‌ నైరా బెనర్జీ తన తాజా సినిమా 'వన్‌ నైట్‌ స్టాండ్‌' సినిమా షూటింగ్‌లో తాగి పాల్గొందట! ఈ విషయాన్ని నైరా బెనర్జీనే స్వయంగా చెప్పుకొచ్చింది. ఓ ఇంటిమేట్‌ సీన్లో నటించడానికి ఇబ్బంది పడుతుంటే కొద్దిగా మందు కొట్టమని యూనిట్‌ సలహా ఇవ్వడంతో వారి సలహా తూచా తప్పకుండా పాటించేసిందట! అయితే ఆ మరుసటి రోజు ఇంటికి వెళ్ళడానికి భయమేసిందని చెబుతోంది. ఇంట్లో వాళ్ళు తను తాగిన విషయం ఎక్కడ పసికడతారో అన్నది ఆమె భయమట! ఇలా ఓపెన్‌గా మందు కొట్టానని చెప్పేటప్పుడు లేని భయం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎందుకు? బడాయి కబుర్లు కాకపోతే అంటున్నారు బాలీవుడ్‌ జనాలు. మొత్తానికి మధురిమ అదే నైరా బెనర్జీ అక్కడి కల్చర్‌ని త్వరగానే వంటబట్టించుకుందని టాలీవుడ్‌ జనాలు వ్యాఖ్యానిస్తున్నారు.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top