అపరంజి మెరిసింది | FZ News


రూ.29 వేల పైన ముగింపు

న్యూఢిల్లీ: మూడు నెలల కనిష్ఠ స్థాయిల నుంచి బంగారం ధర పైకి ఎగిసింది. ఢిల్లీలో పది గ్రాముల బంగారం (99.9 శాతం శుద్ధత) ధర 505 రూపాయలు పెరిగి 29,225 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బుల్లిష్‌ వాతావరణం, జువెలర్లు ముమ్మరంగా కొనుగోళ్లు జరపడం.. బంగా రం ధరను పరుగులెత్తించాయి. మరోవైపు పారిశ్రామిక యూనిట్లు, కాయి న్ల ఉత్పత్తిదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి కూడా 400 రూపాయల మేర పెరిగి 39 వేల మార్క్‌ను అధిగమించి 39,200 రూపాయల వద్ద ముగిసింది. 

న్యూయార్క్‌లో ఔన్సు బంగారం 2.73 శాతం పెరిగి 1,243.50 డాలర్లకు, వెండి 2.69 శాతం పెరిగి 16.39 డాలర్లకు పెరిగాయి. దేశీ మార్కెట్లో 99.5 శాతం శుద్ధ బంగారం పది గ్రాములు సైతం 505 రూపాయలు పెరిగి 29,075 రూపాయలకు చేరింది. గత రెండు రోజుల్లో బంగారం 280 రూపాయల మేర క్షీణించింది.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top