చర్మం, కళ్లు, చెవులు లేని హార్లెకిన్ బేబీ జననం
నాగపూర్, జూన్ 11: చర్మం లేకుండా.. తెల్లటి పొడలతో.. ఎర్రటి నోరు.. ముక్కుల స్థానంలో రెండు రంధ్రాలతో, బల్బుల్లాంటి కళ్లతో, చెవులు అసలే లేకుండా.. గ్రహాంతరవాసిలా కనిపిస్తున్న ఈ జీవి ఒక నవజాతశిశువంటే నమ్ముతారా? మహారాష్ట్రలోని వాడి పట్టణానికి చెందిన ఒక మహిళ నాగపూర్‌లోని లతామంగేష్కర్ ఆస్పత్రిలో ఇటీవలే ఈ వింత శిశువుకు జన్మనిచ్చింది. జన్యుపరమైన లోపాలతో పుట్టే ఇలాంటి బిడ్డలను ‘హార్లెకిన్ బేబీ’ అంటారు.
భారతదేశంలోనే ఈ పాప తొలి హార్లెకిన్ బేబీ అని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. కానీ, మనదేశంలో ఇలాంటి శిశువులు ఇంతకుముందు కూడా పుట్టిన దాఖలాలు ఉన్నాయి. వైద్యులు చెబుతున్నదాని ప్రకారం 1750 నుంచి ఇలాంటి శిశుజననాలు దాదాపు డజనుకు పైగా రికార్డుల్లో నమోదయ్యాయి. 1750 నాటి నుంచి నమోదైన ఈ రికార్డులను పరిశీలిస్తే.. ఆ ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఇలాంటి ఒక శిశువు జన్మించింది.
అలాగే పాకిస్థాన్‌లో ఒక మహిళకు నలుగురు పిల్లలు ఇలాగే పుట్టి చనిపోయారు. సౌతాఫ్రికాలో మాత్రం ఒక చిన్నారి ఇలాగే పుట్టి చక్కగా ఉన్నాడు. కాగా.. చూపు కూడా లేకుండా జన్మించిన ఈ పాపను ప్రస్తుతం ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామని.. ఈ శిశువు బతికే అవకాశాలు దాదాపు లేవని వైద్యులు పేర్కొంటున్నారు.
Post a Comment