ముఠామేస్త్రీలో ఆ ఈజ్ తగ్గలేదు | FZ News



సినీ ‘మా’ అవార్డ్స్ ఫంక్షన్ లో చిరంజీవి లైవ్ పెర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది. తన డ్యాన్స్ తో ఫంక్షన్ కు వచ్చిన వారిని కట్టిపడేశారు చిరు. ముఠామేస్త్రీ సాంగ్ కు స్టెప్పులేసి.. అదరగొట్టారు. మెగాస్టార్ లైవ్ పెర్ఫామెన్స్ గురించి ముందుగా ఎలాంటి సమాచారం లేదు. యువ హీరోల డ్యాన్సుల తర్వాత తనదైన స్టైల్ లో స్టేజీ మీదకొచ్చిన చిరు… డ్యాన్సులతో ఇరగదీశారు.

తన పెర్ఫామెన్స్ తో .. అన్నయ్యా మజాకా అనిపించారు చిరు. తన 150వ సినిమా కత్తిలాంటోడికి ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నట్టు కనిపించారు. పొలిటికల్ గా బిజీ అయిన తర్వాత చిరు ఓ స్టేజీపై ఇంతలా డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి. టైమింగ్ తప్పకుండా… డ్యాన్స్ చేస్తూ అందరిలోను ఉత్సాహాన్ని రగిలించారు చిరు. మెగాస్టార్ డ్యాన్స్ చేస్తున్నంత సేపు.. ఆడిటోరియం అంతా ఈలలు కేకలతో దద్దరిల్లిపోయింది.  ఈ కార్యక్రమానకి మెగా ఫ్యామిలీ తరలివచ్చింది.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top