తొలి బయోపిక్‌లో విద్యాబాలన్‌ | FZ News



‘తీన్‌’ చిత్రంతో ఈ ఏడాది బాలీవుడ్‌లో తన ఖాతాను తెరచిన విద్యాబాలన్‌ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. తన ప్రతిభతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా నిరూపించుకున్న విద్యా.. ఇప్పటి వరకు ఒక్క బయోపిక్‌లోనూ నటించలేదు. కొన్నాళ్లుగా బాలీవుడ్‌ నటీనటులంతా బయోపిక్‌ల బాటపడుతుంటే.. ఈమె మాత్రం పదుల సంఖ్యలో బయోపిక్‌ ఆఫర్లు వచ్చినా నచ్చక వదిలేసిందట. కానీ.. తొలిసారి కమలదాస్‌ జీవితకథకు అంగీకరించింది. ఆ సినిమా గురించి కొన్ని విశేషాలను ఇలా పంచుకుంది.

‘‘ఇటీవలి కాలంలో చాలామంది నాకు బయోపిక్‌ కథలను వినిపించారు. అయితే.. వాటిలో నచ్చని వాటిని వదిలేశాను. ఏదైనా సరైన సమయంలోసరైన విధంగానే జరుగుతుంది. కమలదాస్‌ జీవితగాథతో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా. త్వరలోనే అది సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాం. ఇది పూర్తిగా మలయాళం సినిమానే. కానీ అన్ని భాషల్లోనూ హిందీ సబ్‌టైటిల్స్‌తో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని విద్యాబాలన్‌ వెల్లడించారు.

గతంలో ఈ అమ్మడు నటించిన ‘డర్టీ పిక్చర్‌’ చిత్రం నటి సిల్క్‌స్మిత జీవితగాథ అని అందరూ అనుకొన్నారు. కానీ ఆ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో విద్యాబాలన్‌ చేస్తున్న తొలి బయోపిక్‌ సినిమా కమలదాస్‌దే అవుతుంది.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top