Abhinetri Telugu Movie Official Teaser | Tamanna | Prabhu Deva | Amy Jackson | #Abhinetri | FZ News


తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ కీలకపాత్రల్లో రూపొందిన చిత్రం ‘అభినేత్రి’. కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నటి అమలాపాల్ భర్త కె.ఎల్.విజయ్ దర్శకత్వం వహంచారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మరియు టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకుడు వి.వి.వినాయక్ చేతులమీదుగా టీజర్ లాంచ్ చేశారు. 

ఈ టీజర్‌లో ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవా డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టాడు. టీజర్‌లో తమన్నా కనిపించకపోయినా.. ప్రభుదేవా మాత్రం అదిరిపోయే స్టెప్స్ వేస్తే అమీ జాక్సన్ టీజర్‌లో ప్రేక్షక పాత్ర వహించింది. ఫస్ట్‌లుక్‌లో అయితే సోనూసూద్‌తో గ్లామర్‌గా కనిపించిన తమ్మూ..ప్రభుదేవాతో చీరకట్టులో కనువిందు చేసింది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ ఈ చిత్రంలో గెస్ట్‌రోల్ పోషించాడని సమాచారం. 

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎమ్.వి.వి. సత్యనారాయణ నిర్మించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్.ఎస్. తమన్, జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'బాహుబలి', 'ఊపిరి' వంటి ద్విభాషా చిత్రాల్లో నటించిన తమన్నా... తొలిసారి త్రిభాషా చిత్రంలో నటించింది.



Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top