040-2111 1111 ఫోన్ చేస్తే ఫ్రీగా ఫుడ్ ఇచ్చేస్తారు | FZ News

లాక్ డౌన్ వేళ కొందరు కులాశాగా విశ్రాంతి తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. బడుగు.. బలహీన వర్గాల ప్రజల తిప్పలు చెప్పాల్సిన అవసరమే లేదు. చేసేందుకు పని లేక.. జేబులో డబ్బుల్లేక.. ఆకలి తీర్చుకోవటానికి వారు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళ.. ఇలా ఆకలితో పస్తులు ఉండకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి తెర తీసింది



Anyone Who Needs Food GHMC Call Number Tweets Kavitha


హైదరాబాద్ మహానగర పరిధిలోని ఎవరైనా సరే.. ఆకలితో ఉంటే చాలు.. చేతిలోని సెల్ ఫోన్ తో 040-2111 1111 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు.. తామే వచ్చి ఆహారాన్ని అందిస్తారు. ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కార్యాలయం చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

సో.. ఆకలిగా ఉన్న వారిని ఆదుకునేందుకు వీలుగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్.. మాజీ ఎంపీ కవిత ఈ వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. సో.. ఆకలిగా ఉన్న వారి సమాచారాన్ని ఫోన్ చేస్తే చాలు.. వారి ఆకలిని తీర్చే అవకాశం హైదరాబాదీయులకు ఉంది. ఆలస్యం ఎందుకు.. మీ ఫోన్లో ఈ నెంబరును సేవ్ చేసుకుంటే సరి.


Source: Tupaki

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top