లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ప్రచారం అవాస్తవం : కేంద్రం | FZ News



న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ప్రచారాన్ని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా తీవ్రంగా ఖండించారు.

ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. 

లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ప్రచారం అవాస్తవం : కేంద్రం

ప్రజలు పుకార్లను నమ్మొద్దని రాజీవ్‌ గౌబా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే.

ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1024కు చేరింది.

901 మంది ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 96 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 27 మంది మృతి చెందారు. 



© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top