న‌న్ను కాదు ద‌ర్శ‌కుడిని అడ‌గండి | FZ News

Pooja Hegde - Hot Actress Photos




ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం ఓ చిత్రం తెర‌కెక్కుతున్న‌ది. పీరియాడిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ది.

యూవీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కోసం అభిమానులు చాలా రోజులుగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎప్పుడూ విడుద‌ల చేసేది చెప్పాలంటూ చిత్ర‌బృందాన్ని త‌ర‌చుగా అడుగుతూనే ఉన్నారు.

హోమ్ క్వారంటైన్‌లో ఉన్న పూజాహెగ్డేను ఓ అభిమాని  ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్‌లుక్ అప్‌డేట్ చెప్పండి అని అడిగారు.

ఈ ప్ర‌శ్న న‌న్ను కాదు మా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ను అడ‌గండి అంటూ తెలివిగా స‌మాధానం చెప్పి త‌ప్పించుకున్న‌ది ఈ సుంద‌రి.

ద‌ర్శ‌కుడు సైతం ప్ర‌భాస్‌తో పాటు నిర్మాణ సంస్థ‌ల‌కే ఆ విష‌యం తెలియాలంటూ స‌మాధానం ఇచ్చారు. 

జార్జియాలో ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసుకొని వ‌చ్చిన ప్ర‌భాస్‌, పూజాహెగ్డేతో పాటు చిత్ర‌యూనిట్ ప్ర‌స్తుతం  స్వీయ‌నిర్భంధంలో ఉన్న‌ది. 


© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top