హీరో కోసం జీవో మార్చిన రాష్ట్ర ప్రభుత్వం | FZ News

state government changed GO for hero

        దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు వేటికి అవే పాక్షిక లాక్ డౌన్ లేదా పూర్తి లాక్ డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో థియేటర్ల ఆక్యుపెన్సీని 100 నుండి 50శాతంకు తగ్గిస్తున్నట్లుగా జీవో విడుదల చేసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రతిష్టాత్మక మూవీ యువ రత్న విడుదల రోజే ఈ నిర్ణయం రావడం పట్ల ఆయన అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా ఓపెనింగ్ వసూళ్ల విషయంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో 100 శాతం ఆక్యుపెన్సీ కోసం క్యాంపెయిన్ చేశారు.




        రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ను హీరో పునీత్ వెళ్లి కలవడం జరిగింది. అభిమానులు మరియు హీరో విజ్ఞప్తి మేరకు జీవోను సవరిస్తూ ఈనెల 7వ తారీకు నుండి 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని ప్రభుత్వం తెలియజేసింది. దాంతో యువత రత్న సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతాయని అభిమానులు అంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. కాని కరోనా కారణంగా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ఈ సమయంలో 50 శాతం ఆక్యుపెన్సీ అంటే మరింతగా వసూళ్లు పడిపోయే అవకాశం ఉందని వంద శాతం ఆక్యుపెన్సీ కోరారు. ప్రభుత్వం 7వ తారీకు వరకు నూరు శాతం ఆక్యుపెన్సీకి ఓకే చెప్పింది. మరి ఈ లోపు వసూళ్లు ఏమైనా నమోదు అయ్యేనా చూడాలి.

source:tupaki

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top