దేశంలో ఉరి కంబం ఎక్కనున్న మొట్టమొదటి మహిళ షబ్నమ్ | FZ News

 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో …మొట్టమొదటి సారిగా ఒక మహిళ ఉరికంబం ఎక్కబోతోంది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహకు చెందిన షబ్నమ్ ను మథురైలోని జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేపట్టారు అధికారులు.

షబ్నమ్ ఇంగ్లిష్‌లో ఎంఏ చేసింది. ఐదో తరగతి కూడా పాస్ కాని సలీంను ప్రేమించి పెళ్లాడాలనుకుంది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి 2008లో తన కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపింది. ఇందులో ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరులు, ఓ చిన్నారి కూడా వున్నారు.

© Provided by their respected owner 


ఈ కేసులో షబ్నమ్‌, సలీంలను దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో వారు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. దీంతో చివరి ప్రయత్నంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన నిరాకరించారు.

దీంతో ఆమెకు ఉరి శిక్షను అమలు చేయడానికి జైలు అధికారులు చర్యలు చేపట్టారు. తేదీ ఖరారు అయిన వెంటనే… షబ్నమ్ ను మథురై జైలులో ఉరి తీస్తారు.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top