పంతం పట్టి రికార్డు కొట్టిన పవన్ ఫ్యాన్స్ | FZ News



50 రోజులు 100 రోజులు 175 రోజులు అంటూ.. రికార్డుల గురించిమాట్లాడుకునే రోజులు ఎప్పుడో పోయాయి. కొన్నేళ్లుగా కలెక్షన్ల గురించి చర్చంతా. కానీ ఈ మధ్య సోషల్ మీడియా రికార్డుల గోల ఎక్కువైపోయింది. ఒక సినిమా టీజర్ ట్రైలర్ల వ్యూస్ లైక్స్ రికార్డుల్ని కూడా అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ట్విట్టర్లో ట్రెండ్స్ సైతం రికార్డులుగా మారిపోయాయి. వివిధ సందర్భాల్లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి దాని మీద అదే పనిగా ట్వీట్లు వేయడం.. వాటి కౌంట్ను బట్టి రికార్డులు నమోదు చేయడం ఈ మధ్య ట్రెండ్గా మారిపోయింది. ఒకప్పుడు లక్షల్లో ట్వీట్లు పడితే గొప్ప అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడవి కోట్ల లెక్కల్లోకి వెళ్లిపోయాయి.

ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో పుట్టిన రోజు సందర్భంగా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ సెట్ చేశారు. 21 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పారు. అది టాలీవుడ్ రికార్డు. పాత రికార్డుల్ని భారీ తేడాతో కొట్టిన ఈ రికార్డు ఇప్పట్లో బద్దలు కాదని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు దాన్ని టార్గెట్గా పెట్టుకుని కొత్త రికార్డు నమోదు చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఇప్పట్లో లేదు. ఇంకే సందర్భం కూడా లేదు కదా అని ఆశ్చర్యం కలుగుతోంది కదా. ఐతే పవన్ పుట్టిన రోజుకు 50 రోజులున్న నేపథ్యంలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ ఈ ట్రెండ్ మొదలుపెట్టారు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 27.5 మిలియన్ ట్వీట్లతో పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పారు.

Source: tupaki

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top