తమిళనాట వరసగా స్టార్ హీరోల ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మొన్నామధ్య రజినీకాంత్.. ఆ తర్వాత విజయ్ ఇంటికి ఇలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గతంలోనే ఈయన ఇంటికి ఓసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇఫ్పుడు రెండోసారి కూడా ఇదే జరిగింది. రజినీ, విజయ్ ఇంటికి వచ్చిన రెండు కాల్స్ కూడా ఆకతాయిల పని అని తేలింది. ఇప్పుడు అజిత్ ఇంటికి కూడా బెదిరింపు కాల్ వచ్చింది. తిరువాయున్మియూరులోని అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే పోలీసులు తనిఖీలు చేసారు.
రెండు గంటలకు పైగానే తనిఖీలు చేసిన పోలీసులకు అక్కడ ఏం దొరకలేదు. దాంతో మరోసారి అది ఫేక్ కాల్ అని నిర్ణయించుకున్నారు. 2020, జులై 18న అజిత్ ఇంటిలో బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి నుంచి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది.
ఆ ఫోన్ వచ్చిన వెంటనే బాంబు స్వాడ్‌తో అజిత్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. ఇప్పుడు మరోసారి కూడా ఇలాగే జరిగింది. ఫోన్ కాల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి కారణాలను త్వరలోనే తెలుసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
అజిత్ (ajith kumar)
ఇది కూడా ముందు వచ్చినట్లుగా ఫేక్ కాల్ అని పోలీసులు తేల్చేసారు. వీలైనంత త్వరలోనే ఈ ఫేక్ కాల్స్ చేసే వాళ్లను పట్టుకుని ఆడుకుంటామంటున్నారు తమిళనాడు పోలీసులు. రజినీకాంత్‌కు ఫేక్ కాల్ చేసింది 8వ తరగతి పిల్లాడు.. ఆ తర్వాత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ చేసింది అంగవైకల్యంతో ఉన్నవాడు.. మరిప్పుడు అజిత్ విషయంలో ఎలాంటి కాల్ వచ్చిందో అని ఆరా తీస్తున్నారు పోలీసులు.
Source: © News18 Telugu
Post a Comment