శత్రఘ్నుసిన్హా వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా అనతికాలంలోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు గ్లామర్.. చబ్బీ పాత్రలతో మెప్పించిన సోనాక్షి ఇప్పుడు మహిళా ప్రాధాన్య చిత్రాలపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం పాకిస్థానీ జర్నలిస్టుగా ‘నూర్’ చిత్రంలో నటిస్తుండగా.. మరో చిత్రం ‘అకీరా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ‘అకీరా’ చిత్రం విశేషాలను కొన్నింటిని వెల్లడించింది సోనాక్షి.
‘‘మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు యాసిడ్ దాడులకు గురవుతున్నారు. ‘అకీరా’ చిత్రంలో దర్శకుడు మురుగదాస్ ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. దాడులను ఎదుర్కొనేందుకు ఆడపిల్లల్లో ముందు ఆత్మరక్షణ పెంపొందాలి. తమ కాళ్లపై తాము నిలబడి.. సమస్యలను ఎదురించి నిలబడగలగాలి. మా చిత్రంలో అకీరా తండ్రి పాత్ర కూడా ఇదేరకంగా ఆలోచిస్తుంది. అందుకే మిగతా ఆడపిల్లల తండ్రిలా తన కుమార్తెను డ్యాన్స్.. మ్యూజిక్ క్లాసులకు కాకుండా కరాటే క్లాసులకు పంపిస్తాడు’’ అని తెలిపింది సోనాక్షి.
సెప్టెంబర్ 2న ‘అకీరా’ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో ఈ అమ్మడు బిజీగా గడుపుతోంది.
Post a Comment